విజయం సాధించిన వర్జిన్ గలక్టిక్ మిషన్ యూనిటీ 22

విజయం సాధించిన వర్జిన్ గలక్టిక్ మిషన్ యూనిటీ 22 వివరాలు

  • ఈ ఘనత సాధించిన మూడో భారత మహిళగా రికార్డు
  • నలుగు నిమిషాల పాటు భార రహిత స్థితిలో బ్రన్సన్ బృందం

అంతరిక్ష పర్యాటకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే క్రతువులో కీలక ముందడుగు పడింది. వినువీధిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికాకు చెందిన ‘వర్జిన్ గెలాక్టిక్’ అంతరిక్ష పరిశోధన సంస్థ ఆదివారం పంపించిన మానవసహిత వ్యోమనౌక “వీఎస్ఎస్ యూనిటీ-22′ ప్రయోగం విజయవంతమైంది. తొలిసారిగా అంతరిక్షంలోకి మనుషు లను తీసుకెళ్లిన వాణిజ్య ప్రయోగంగా యూనిటీ-22 రికార్డు సృష్టించింది.

మిషన్లో ప్రయాణించిన ఆరుగురు వ్యోమగాముల్లో ‘వర్జిన్ గ్రూప్’ అధిపతి రిచర్డ్ బ్రాతో పాటు తెలుగింటి ఆడపడుచు శిరీష బండ్ల (34)కూడా ఉన్నారు. దీంతో ఆకాశవీధిలో తెలుగు కీర్తి పతాకం రెపరెపలాడింది. ఈ మిషన్ సక్సె తో రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసియానం చేసిన నాలుగో భారత సంతతి వ్యక్తిగా, మూడో భారత సంతతి మహిళగా శిరీష రికార్డు సృష్టించారు.

భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ ప్రయోగం.. వాతావరణ ప్రభావం కారణంగా గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. న్యూమెక్సికోలో వర్జిన్ గెలాక్టిక్ నిర్మించిన ‘స్పేస్ పోర్ట్ అమెరికా’ లాంచింగ్ సెంటర్ నుంచి మొదలైన ఈ రోదసి యాత్ర… దాదాపు 70 నిమిషాల పాటు కొనసాగింది. అంతరిక్షయానం చేసిన వ్యోమగాములు రాత్రి 9.20 గంటల ప్రాంతంలో (భారత కాలమానం) సురక్షితంగా తిరిగి భూమికి చేరుకున్నారు. రోదసిలో దాదాపు ఐదు నిమిషాల పాటు భారరహిత స్థితిలో ఉండి పుడమి అందాలను వీక్షించారు.



యూనిటీ-22′ యాత్ర సాగిందిలా..
రాత్రి 8.03 గంటలు
వీఎంఎస్ ఈవ్ అనే వైట్ నైట్ ఎయిర్ క్రాఫ్ట్.. ‘యూనిటీ-22’ను నింగి లోకి తీసుకెళ్లింది.
రాత్రి 8.43 గంటలు
టేకాఫ్ అయిన 40 నిమిషాల అనంతరం వీఎంఎస్ఈవ్ నుంచి యూనిటీ-22 విడిపోయింది.
రాత్రి 8.45 గంటలు
అనంతరం భూమి నుంచి 13 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నాక.. యూనిటీ-22 ఇంజిన్ ప్రజ్వరిల్లడం ప్రారంభించడంతో రాకెట్ వేగం 4 వేల కిలోమీటర్లకు చేరుకున్నది.
రాత్రి 8.50 గంటలు
నిర్దేశిత ఎత్తుకు చేరుకున్నాక రాకెట్ ఇంజిన్ ఆగిపోయింది. వ్యోమనౌక ప్రయాణం కొనసాగింది.
రాత్రి 9.00 గంటలు
భూవాతావరణానికి, రోదసికి సరిహద్దుగా భావించే కర్మాన్ రేఖ (భూమి నుంచి 58 మైళ్ల ఎత్తు) వద్దకు వ్యోమనౌక చేరుకున్నది. ఇక్కడ యూనిటీ-22లోని ఆరుగురు వ్యోమగాములు నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు భారరహిత స్థితిలో ఉన్నారు. రోదసి నుంచి భూమి అందాలను వీక్షించారు.
రాత్రి 9.10 గంటలు
అంతరిక్ష యాత్ర పూర్తిచేసుకున్న వ్యోమనౌక ‘ఫెదర్ కాన్ఫిగరేషన్ మోడ్’లోకి మారింది.
రాత్రి 9.15 తర్వాత
గైడర్ల సాయంతో స్పేస్ షటిల్ గా మారిన వ్యోమనౌక సురక్షితంగా భూమిని చేరుకున్నది

This is about :- విజయం సాధించిన వర్జిన్ గలక్టిక్ మిషన్ యూనిటీ 22

for more updates visit :-  CLICK HERE

విజయం సాధించిన వర్జిన్ గలక్టిక్ మిషన్ యూనిటీ 22