telangana Posts Update 2020

telangana Posts Recruitment Update 2020 from all over the telangana Aspirants.

 

కేటీ రామారావు నేతృత్వంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణ మొదలైంది. _ ప్రభుత్వశాఖలతో పాటు
ప్రయివేట్‌రంగంలోనూ భారీ ఎత్తున ఉపాది కల్పనపై గురిపెట్టింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నీటిపారుదల
రంగానికి సీఎం కేసీఆర్‌ ప్రథమ ప్రాధాన్యం ఇవ్వగా, టీఎస్‌ఐపాస్‌ ద్వారా కొత్తగా వచ్చిన పరిశ్రమలతో ప్రయివేట్‌రంగంలో స్థానికులకు కొంత ఉపాథి లభించింది.

ఒక్క ఐటీ రంగంలోనే లక్షకు పైగా ఉద్యోగాలు లభించాయి. ప్రయివేట్‌ రంగంలో స్థానికులతో పాటు ఇతరులు కూడా
ఉద్యోగాలు పొందుతున్న నేపథ్యంలో… ఇపుడు పారిశ్రామిక రంగాన్ని ఓవైపు ప్రోత్సహిస్తూనే మరోవైపు స్థానికులకు ఉపాధి కల్పించే చర్యలకు పూనుకుంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమల్లోకి తెచ్చిన కొత్తపథకాలు, సాగునీటి ప్రాజెక్టుల వల్ల గ్రామీణ ఉపాధి రంగం.. వ్యవసాయం పటిష్ట కాగా, చదువుకున్న యువతలో… పరిశ్రమల కోసం భూములు త్యాగం చేసిన కుటుంబాలలో ఉపాధిపై కొంత అసంతృప్తి వాతావరణాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఈక్రమంలో తెలంగాణ యువత పూర్తిస్థాయి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. అందిపుచ్చుకునేలా నియామకాల పండుగకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఉద్యోగాలే ఉద్యోగాలు

అనేక ప్రభుత్వశాఖల్లో ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై దృషి పెట్టింది. దేశంలోనే తొలిసారిగా పట్టణాలు, నగరాల్లో

వార్డు ఆఫీసర్‌ ఉద్యోగాలకు శ్రీకారం చుట్టింది. దీనిద్వారా 2,298 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

 

మునిసిపాలిటీలోని ప్రతివార్డు అభివృద్ధి, పర్యవేక్షణ బాధ్యత వార్డు ఆఫీసర్‌ చూస్తారు. పట్టణాల అభివృద్ధిలోనూ వీరిపాత్ర కీలకంగా ఉండబోతోంది. కొత్త మునిసిపల్‌ చట్టాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్‌ దాని అమలుకు ఈ వినూత్న
విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇక జలవనరుల శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం కొత్తగా 576 ఏఈలు, ఏఈఈలను తీసుకోవాలన్న నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. దీంతో పాటు 2వేల వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు,
4 వేల లష్కర్‌ పోస్టులు కూడా జలవనరుల శాఖలో భర్తీచేసే అవకాశాలున్నాయి.


ఇక ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేట్‌ రంగంలోనూ స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇటీవల కేబినెట్‌ తీర్మానం ఆమోదించింది. స్థానికులకు, ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహ ఇవ్వాలని నిర్ణయించింది. ఫార్మాసిటీలో తొలివిడతలో 150 కంపెనీలు ప్రారంభమవుతుండగా, భూమి కోల్పోయిన ప్రతి కుటుంబం
నుండి కనీసం ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. నైపుణ్యం లేకుంటే… స్కిల్‌ డెవలప్‌మెంట్‌
కేంద్రం ద్వారా వారికి శిక్షణనిచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సూచించారు. ఫార్మాసిటీ కోసం 8,500ఎకరాల భూసేకరణ జరగ్గా, స్థానికులకు  ఉద్యోగాలు లభించనున్నాయి. కొత్తగా వచ్చే అన్ని పరిశ్రమలకు ఇదే తరహా విధానం తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. నియామకాల అంశంలో ప్రభత్వం సీరియస్‌గా దృష్పిపెట్టడంపై నిరుద్యోగుల్లో హర్షం  అవుతోంది.

This is about telangana Recruitment Posts Update 2020

Thanks for watching, click here to check more notification details

Visit again

telangana Posts Recruitment Update 2020