NTPC

Railway Exams related important News 2020 NTPC and Group D related

and Exams conduct from 2021 is UPSC.

రైల్వే ఎన్‌టిపిసి (ఆర్‌ఆర్‌బి NTPC), గ్రూప్ డి (ఆర్‌ఆర్‌బి Group-D) నియామక పరీక్షల్లో మరింత ఆలస్యం ఉండవచ్చు. ఎన్‌టిపిసి, గ్రూప్ డి రైల్వేలలో అతిపెద్ద నియామకాలు, వీటి కింద వరుసగా 35 వేలు & 1 లక్ష పోస్టులపై నియామకాలు జరగాలి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు సీనియర్ అధికారి ఎన్‌డిటివితో ఒక సంభాషణలో మాట్లాడుతూ, “రైల్వే ప్రస్తుతం పరీక్షను నిర్వహించడానికి ఏజెన్సీని నియమించే పనిలో ఉంది. ఏజెన్సీ నియామకం ఇంకా పూర్తి కాలేదు, కాని త్వరలో ఏజెన్సీ నియామకం పూర్తవుతుంది.



“రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మార్చిలో ఈ నియామక పరీక్షలను నిర్వహిస్తుంది. మొదట ఎన్‌టిపిసి లేదా గ్రూప్ డిలో ఏ పరీక్ష జరుగుతుందో నిర్ణయించబడలేదు, మేము రెండు పరీక్షలను కూడా ఒకేసారి నిర్వహించగలము. ”ఎన్‌టిపిసి మరియు గ్రూప్ డి పరీక్ష తేదీలు జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదల అవుతాయని భావిస్తున్నారు.

2nd UPDATE

రైల్వే ఉద్యోగాలు UPSC భర్తీ

రైల్వేల్లో ఇకపై జరిగే అన్ని నియామకాలు యూపీఎస్సీ(యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) సివిల్‌ సర్వీస్‌  పరీక్షల ద్వారా నిర్వహిస్తామని, ఐదు విభాగాల్లో ఈ నియామ కాలు జరుగుతాయని రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ గురువారం వెల్లడించారు. రైల్వేల్లోని ఎనిమిది సర్వీసులను విలీనంచేసి ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ (ఐఆర్‌ఎమ్మెస్‌) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించిన విషయం తెలిసిందే.



 

రైల్వేలో చేరాలనుకునే అభ్యర్థులు యూపీఎస్సీ అభ్యర్థుల మాదిరిగానే ప్రిలిమ్స్‌ పరీక్షలకు హాజరుకావాలని, ఆ తర్వాత ఐఆర్‌ఎమ్మెస్‌లోని ఐదు స్పెషాలిటీల్లో (వీటిలో సివిల్‌, మెకానికల్‌, టెలికం, ఎలక్ట్రికల్‌ విభాగాలకు సంబంధించిన టెక్నికల్‌ కార్యకలాపాలను నిర్వహించే ఇంజినీరింగ్‌ స్పెషాలిటీలు నాలుగు, అకౌంట్స్‌, పర్సనల్‌, ట్రాఫిక్‌ అధికారులను నియమించే నాన్‌-టెక్నికల్‌ స్పెషాలిటీ ఒకటి ఉంటాయి) దేనిని ఎంచు కొంటారో తెలియజేయాల్సి ఉంటుందని వీకే యాదవ్‌ తెలి పారు.

IRMS

ఈ మేరకు ఐఆర్‌ఎమ్మెస్‌ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. రైల్వే సర్వీసుల విలీనంపై ఆందోళనలు
వ్యక్తమవుతున్న క్రమంలో ఆయా అంశాలపై ఆయన స్పష్టతనిచ్చారు. క్యాడర్‌ విలీనానికి సంబంధించిన విధివిధా
నాలు ఖరారయ్యేవరకు అధికారులంతా తమసె స్పెషలైజ్డ్‌సర్వీసుల్లో కొనసాగుతారని, సీనియార్టీ విషయంలో ఏ
అధికారికీ అన్యాయం జరుగకుండా “చూస్తామని వీకే యాదవ్‌ స్పష్టం చేశారు.

 

This is the News from Railway

and also Click Here to Get More details officially:- CLICK HERE

Thanks for watching this page and also click Here to get more updates

 

Railway Exams related important News 2020
Tagged on: